బాల చెలిమి ముచ్చట్లు

 2018 ఏప్రిల్‌ 2న అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం రోజున హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో 'చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ' ఆధ్వర్యంలో 'బాల చెలిమి ముచ్చట్లు' పేరుతో తొలి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి కొనసాగింపుగా ప్రతినెల రెండో శనివారం బాలల సాహిత్యంపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

16

మ‌ల్లేశం చిత్ర‌బృందం అనుభ‌వాలు

మల్లేశం సినిమాను కమర్షియల్‌ సినిమాగా చూడలేదని, సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని తీయడం జరిగిందని మల్లేశం సినిమా దర్శకులు రాజ్‌ రాచకొండ అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 16వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లేశం చిత్రబృందం పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. More

15

శిశు తరగతిలోనే విద్యకు పునాది పడాలి

బాల‌ల‌ను ఆలోచింప‌జేయ‌డం ముఖ్య‌మ‌ని, వారిని భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దేలా ర‌చ‌న‌లు సాగాల‌ని చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఛైర్మన్‌ మణికొండ వేదకుమార్ అన్నారు.  More

14

'టంగ్‌ యంగ్‌' పుస్తకావిష్కరణ

పిల్లలకు సృజనాత్మక కథలు తెలియాలంటే గ్రామీణ స్థాయి నుంచి బాల సాహిత్యంపై అవగాహన తెలియపరచాల్సిన అవసరం ఉందని ఓ.యు, మాజీ చరిత్ర శాఖాధిపతి ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 14వ కార్యక్రమాన్ని నిర్వహించారు. More

13

శిశు తరగతిలోనే విద్యకు పునాది పడాలి

భాషకు మూలం అక్షరాలని, చదవగల్గిన, రాయగల్గిన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం చేస్తారని ప్రముఖ విద్యాసంస్థల అధినేత నల్లమల్లారెడ్డి పేర్కొన్నారు. అక్షరాలు దిద్దుతూ పలకాలని, పలుకుతూ దిద్దాలని, శిశు తరగతిలోనే విద్యార్థులకు గట్టి పునాది పడాలన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 13వ కార్యక్రమాన్ని నిర్వహించారు.  More

12

జ్ఞాన తెలంగాణే బంగారు తెలంగాణ 

సమాజాన్ని మార్చేది నేటి పిల్లలేనని, ప్రస్తుత సమాజంలో బాలల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్‌ ఛైర్మన్‌ జూలూరీ గౌరీశంకర్‌ పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 12వ కార్యక్రమాన్ని నిర్వహించారు. More

11

బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు

బాలలను మార్చేది బాల సాహిత్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 11వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.    More

10

బాల సాహిత్యం సృష్టించబడాలి

బాల సాహిత్యం సృష్టించబడాలని డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 10వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  More

9

బాలల్లో రచనా నైపుణ్యాన్ని పెంపొందించాలి 

బాలల్లో రచనా నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 9వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. More

8

బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు

బాలలు ఉన్నతంగా ఎదిగే స్థితిని కల్పించే రచనలను రచయితలు అందించాలని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత డాక్టర్‌ ఎం భూపాల్‌రెడ్డి అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 8వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల భావాలను గ్రహించి వారి మనస్తత్వాన్ని గమనించి నడవడికను తీర్చిదిద్దేలాగా రచనలు ఉంటే బాగుంటుందని చెప్పారు. More

7

బాల సాహిత్యం దృశ్యశ్రవణ మాధ్యమాలు - ప్రసారాలు

బాలల సంపూర్ణ వికాసం కోసం బాల సాహిత్యాన్ని దృశ్యశ్రవణ పద్ధతిలో అందించడం ఎంతో అవసరమని టి.శాట్‌ సీఈవో శైలేష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 'బాలసాహిత్యం దృశ్యశ్రవణ మాధ్యమాలు - ప్రసారాలు' అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 7వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. . More

6

బాలసాహిత్యం - ముందడుగు 

పిల్లల కోసం పెద్దవాళ్లు రచనలు చేసినా... పిల్లల కోసం పిల్లలే రచనలు చేసినా... వాటిని చదివినపుడు బాలలు సరికొత్త ఊహాప్రపంచంలోకి వెళ్లగలగాలి. అలాంటి రచనలే పిల్లల్లో సృజనాత్మకతను, ఊహాశక్తిని పెంచుతాయని... సెప్టెంబర్‌ 8న హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన 6వ 'బాలచెలిమి ముచ్చట్లు' కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. More

5

బాల సాహిత్యం - ప్రభావం 

వాస్తవాలను ప్రతిబింబించి.... బాలల మానసిక పరిణతిని పెంచే విలువలున్న రచనలు వచ్చినపుడే బాల సాహిత్యానికి పరిపూర్ణత, ప్రయోజకత్వం లభిస్తుంది. ప్రస్తుత సమాజంలో అలాంటి రచనలు రావాల్సిన అవసరం ఉందని... హిమాయత్‌ నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండో శనివారం బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. More

4

బాల సాహిత్య వికాసం- మనం, మన ఆలోచనలు 

తరం మారుతోంది... స్మార్ట్‌ తరం దూసుకొస్తోంది... వారి ఆలోచనా విధానం కూడా శరవేగంగా మారుతోంది... మరి ఇలాంటి పరిస్థితుల్లో... బాల సాహిత్యం కూడా మారాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో మానసిక పరిణతిని పెంపొందించే స్థాయిలో... నేటితరానికి తగ్గట్టుగా బాల సాహిత్యం రావాల్సిన ఆవశ్యకత ఉందని... బాల చెలిమి నాల్గవ ముచ్చట్లలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. More

3

నేను - నా రచనా నేపథ్యం 

కాలం మారుతోంది... సామాజిక జీవనపరిస్థితులూ మారుతున్నాయి... రేపటితరమైన పిల్లల ఆలోచనా విధానం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో.. బాలల సాహిత్యం పేరుతో... అనగనగా అని కథలు మొదలు పెట్టకుండా... పిల్లల్లో మానసిక పరిణితిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని... జూన్‌ 9న ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన బాలచెలిమి ముడవ ముచ్చట్లు కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు, రచయితలు పేర్కొన్నారు. More

2

బాలల సాహిత్యం - రచన - సవాళ్లు 

'చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ' చైర్మన్‌ యం. వేదకుమార్‌ ఆధ్యక్షతన... మే 12న జరిగిన 'బాలల సాహిత్యం - రచన - సవాళ్లు' కార్యక్రమంలో ప్రముఖ బాల సాహితీవేత్తలు డా. వి.ఆర్‌.శర్మ, పైడిమర్రి రామకృష్ణ, దాసరి వెంకట రమణ, వేదాంతసూరి, డా. కందెపి రాణీ ప్రసాద్‌, పుట్టగంటి సురేష్‌, డా. పత్తిపాక మోహన్‌, డా. బెల్లంకొండ సంపత్‌, డా.రఘు, గరిపల్లి అశోక్‌, అనిల్‌ బత్తుల, చొక్కపు వెంకట రమణ, డా.సిరి, తిరునగరి, పెండెం జనార్దన్‌, రాజా వాదిరెడ్డి మల్లీశ్వరి, జుగాష్‌ విల్లీ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. More

1

బాల చెలిమి ముచ్చ‌ట్లు 

ప్ర‌పంచ పిల్ల‌ల పుస్త‌క దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ హిమాయ‌త్ న‌గ‌ర్ లోని ఆక్స్‌ఫ‌ర్డ్ గ్రామ‌ర్ స్కూల్‌లో 2 ఏప్రిల్ 2018వ తేదీన‌ నిర్వ‌హించిన బాల చెలిమి ముచ్చ‌ట్లు కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ అయాచితం శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ చిన్న‌పిల్ల‌ల‌లో ప‌ఠ‌నాస‌క్తిని పెంపొందించే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దేన‌ని అన్నారు. More